జన సైనికులందరూ ఈ ఆర్టికల్ చదవండి: పవన్ కల్యాణ్

  • ట్వీట్ చేసిన జనసేన పార్టీ అధినేత
  • ఆప్, జనసేనను పోలుస్తూ కథనం
  • రచయిత పుల్లారావును అభినందించిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని చదవాల్సిందిగా తన పార్టీ కార్యకర్తలను కోరారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డా.పి.పుల్లారావు చాలా అద్భుతమైన కథనాన్ని రాశారని పవన్ ప్రశంసించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని, ఆంధ్రప్రదేశ్ లో జనసేనను పోల్చుతూ చేసిన తప్పులు, భవిష్యత్ పోరాటాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలతో విశ్లేషణాత్మక అభిప్రాయాన్ని చెప్పారన్నారు.

జనసేనను ఏర్పాటు చేసిన ఉద్దేశం, పార్టీ లక్ష్యాలు, రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని తీసుకురావడం తదితర అంశాలపై తమను తాము సరిదిద్దుకుని ముందుకు సాగుతామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Go Back to Shorts
pavan kalyan
Jana Sena
article

More Telugu News